ఎంసెట్‌ ‘అగ్రి’ పోటీలో 70 శాతం అమ్మాయిలే

ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగం పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో అమ్మాయిలే అధికంగా ఉన్నారు. ఈనెల 14 నుంచి ఎంసెట్‌ ప్రారంభం కానుంది. ఈసారి అగ్రి విభాగానికి మొత్తం 94,376 మంది దరఖాస్తు చేయగా వారిలో 65,626 మంది(70 శాతం) అమ్మాయిలు

Published : 06 Jul 2022 05:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగం పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో అమ్మాయిలే అధికంగా ఉన్నారు. ఈనెల 14 నుంచి ఎంసెట్‌ ప్రారంభం కానుంది. ఈసారి అగ్రి విభాగానికి మొత్తం 94,376 మంది దరఖాస్తు చేయగా వారిలో 65,626 మంది(70 శాతం) అమ్మాయిలు ఉండటం విశేషం. అదే సమయంలో ఇంజినీరింగ్‌ విభాగానికి మొత్తం 1,72,075 మంది పోటీ పడుతుండగా అందులో అమ్మాయిలు 67,589 మంది మాత్రమే ఉన్నారు. అంటే 39.27 శాతం. అగ్రి విభాగానికి అమ్మాయిల సంఖ్య కొన్నేళ్ల కిందటే అబ్బాయిల కంటే దాటిందని, అది క్రమేణా ఇప్పుడు 70 శాతానికి చేరిందని ఎంసెట్‌ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇంజినీరింగ్‌కు కూడా 40 శాతం వరకు ఉన్నారని, ఆ శాతం కూడా వచ్చే కొద్దేళ్లలో మరింత పెరుగుతుందని వారు చెబుతున్నారు. అందుకు ఐటీ కొలువుల్లో వారికి ప్రాధాన్యం పెరుగుతోందని, కొన్ని కంపెనీలు కనీసం మూడో వంతు అమ్మాయిలు ఉండాలన్న నిబంధన విధించుకుంటున్నాయని వర్సిటీ ఆచార్యులు విశ్లేషిస్తున్నారు. 2019లో ఇంజినీరింగ్‌లో 38.25 శాతం, అగ్రికల్చర్‌లో 68.90 శాతం మంది అమ్మాయిలు దరఖాస్తు చేశారు. అంటే క్రమేణా వారి శాతం పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని