చెరువులో స్తంభం.. చేటు తెచ్చే కాలం

అసలే వర్షాకాలం.. ఆపై అన్ని చెరువుల్లోనూ నీటిమట్టం పెరుగుతున్న క్రమం. హైదరాబాద్‌ శివారు మొయినాబాద్‌ మండలం చిలుకూరు పెద్దచెరువులోని కొన్ని విద్యుత్‌ స్తంభాలు దాదాపుగా ఒరిగిపోయాయి. కేవలం తీగల ఆధారంగా నిలిచి ఉన్నాయి. వరస వర్షాల నేపథ్యంలో

Published : 06 Jul 2022 05:58 IST

అసలే వర్షాకాలం.. ఆపై అన్ని చెరువుల్లోనూ నీటిమట్టం పెరుగుతున్న క్రమం. హైదరాబాద్‌ శివారు మొయినాబాద్‌ మండలం చిలుకూరు పెద్దచెరువులోని కొన్ని విద్యుత్‌ స్తంభాలు దాదాపుగా ఒరిగిపోయాయి. కేవలం తీగల ఆధారంగా నిలిచి ఉన్నాయి. వరస వర్షాల నేపథ్యంలో చెరువులో నీటిమట్టం మరింత పెరిగినా, వానల ధాటికి మట్టి కుంగిపోయినా ఈ స్తంభాలు పడిపోయే అవకాశముంది. అదే జరిగితే విద్యుదాఘాతంతో సమీప గ్రామాలకు అనూహ్య నష్టం వాటిల్లే ప్రమాదముంది. ఇదే విషయాన్ని ఏడీఈ రమేశ్‌ మేడి దృష్టికి తీసుకెళ్లగా స్తంభాల పునాది(బేస్‌) సరిగా లేకపోతే మట్టి మెత్తగా ఉన్నచోట వర్షాలకు చెరువుల్లో ఉండే స్తంభాలు ఇలా వంగే అవకాశం ఉందన్నారు. సమస్యను రెండుమూడు రోజుల్లో పరిష్కరిస్తామన్నారు.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని