డిస్కంల నష్టాలు రూ.48,982 కోట్లు

విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు నష్టాలు భారీగా పెరుగుతున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎస్‌.పి.డి.సి.ఎల్‌)కు రూ.33,555.34 కోట్లు, ఉత్తర తెలంగాణ డిస్కంకు రూ.15,426.88 కోట్ల నష్టాలున్నట్లు తాజాగా వెల్లడించాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి

Published : 06 Jul 2022 05:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు నష్టాలు భారీగా పెరుగుతున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎస్‌.పి.డి.సి.ఎల్‌)కు రూ.33,555.34 కోట్లు, ఉత్తర తెలంగాణ డిస్కంకు రూ.15,426.88 కోట్ల నష్టాలున్నట్లు తాజాగా వెల్లడించాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికలను ఆ సంస్థలు తాజాగా ప్రభుత్వానికి అందజేశాయి. మొత్తమ్మీద ఈ రెండు సంస్థల నష్టాలు రూ.48,982 కోట్లకు చేరినట్లు స్పష్టం చేశాయి. ఇవి కాకుండా... 2021-22లో కూడా రెండు సంస్థలకు కలిపి రూ.5 వేల కోట్లకు పైగా నష్టాలొచ్చినట్లు ప్రాథమిక అంచనా. అప్పులు సైతం భారీగా ఉండటంతో వాటికి నెలవారీ వాయిదాలు కట్టడానికి కూడా సింహభాగం నిధులు వెచ్చిస్తున్నాయి. రెండు డిస్కంలకు కలిపి నెలకు రూ.3,800 కోట్ల దాకా ఆదాయం వస్తున్నా నిర్వహణ వ్యయం, అప్పులపై కట్టాల్సిన కిస్తీలు, ఉద్యోగుల జీతాలకు చెల్లింపులు వంటివన్నీ పోతే మరో రూ.300 కోట్ల దాకా అవసరం.

ఎందుకీ నష్టాలు?: వ్యవసాయానికి, ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల దాకా పూర్తి ఉచితంగా కరెంటును ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఎత్తిపోతల పథకాలకు, ఇతర కొన్ని వర్గాలకు ఛార్జీల్లో ఇస్తున్న రాయితీల పద్దు కింద నెలకు రూ.875 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మొదటివారంలో డిస్కంలకు విడుదల చేస్తోంది. ఇవి కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు వాడుతున్న కరెంటుకు బిల్లులు నెలనెలా చెల్లించడం లేదు. కొన్నేళ్లుగా ఈ కార్యాలయాల బిల్లులు పేరుకుపోవడంతో వీటి నుంచి రావాల్సిన బకాయిలు రూ.10 వేల కోట్లకు చేరాయి. ప్రైవేటు వర్గాల నుంచి రావాల్సిన బకాయిలు కూడా రూ.3 వేల కోట్ల దాకా ఉన్నట్లు డిస్కంలు గత ఆర్థిక సంవత్సరంలో ఈఆర్‌సీకిచ్చిన నివేదికలో వెల్లడించాయి. ఆదాయ, వ్యయాల మధ్య లోటు అధికంగా ఉన్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభం (2022 ఏప్రిల్‌ 1) నుంచి కరెంటు ఛార్జీలను సైతం డిస్కంలు పెంచాయి. ఛార్జీల పెంపుతో అదనంగా ఈ ఏడాది రూ.5500 కోట్ల దాకా ఆదాయం వస్తుందని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని