18 వేల ఇంటర్‌ జవాబుపత్రాల పునఃపరిశీలనకు దరఖాస్తులు

ఇంటర్‌ జవాబుపత్రాల పునఃపరిశీలన కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. తాము పాసవుతామని కొందరు, మార్కులు పెరుగుతాయని మరికొందరు విద్యార్థులు పునఃపరిశీలనకు దరఖాస్తు చేస్తున్నారు. అందుకు ఈనెల 6వ తేదీ వరకు గడువిచ్చారు. ఈక్రమంలో

Published : 06 Jul 2022 05:58 IST

నేటితో ముగియనున్న గడువు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ జవాబుపత్రాల పునఃపరిశీలన కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. తాము పాసవుతామని కొందరు, మార్కులు పెరుగుతాయని మరికొందరు విద్యార్థులు పునఃపరిశీలనకు దరఖాస్తు చేస్తున్నారు. అందుకు ఈనెల 6వ తేదీ వరకు గడువిచ్చారు. ఈక్రమంలో మంగళవారం రాత్రికి 17,995 జవాబుపత్రాలకు సంబంధించి దరఖాస్తులు అందాయి. పునఃమూల్యాంకనానికి మరో 3,943 దరఖాస్తులు వచ్చాయి. బుధవారం కూడా గడువు ఉన్నందున చివరిరోజు మరిన్ని దరఖాస్తులు రావొచ్చని భావిస్తున్నారు. తప్పిన వారితోపాటు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం దరఖాస్తు గడువు కూడా బుధవారంతో ముగియనుంది.

ఇంటర్‌ ప్రవేశాలకు లాగిన్‌ ఎప్పుడు?

పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలైనా కళాశాలల్లో ఫస్టియర్‌లో చేరేందుకు వచ్చిన విద్యార్థుల పేర్లను నమోదు చేసేందుకు పోర్టల్‌ లాగిన్‌ అవకాశం ఇవ్వలేదని, దాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్రాధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌ తెలిపారు. ఈ మేరకు వారు ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌కు మంగళవారం వినతిపత్రం సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని