ఏపీలో గ్రూపు-1 ఉద్యోగాలకు 163 మంది ఎంపిక

గ్రూపు-1 ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. డిప్యూటీ కలెక్టర్‌, డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ (వాణిజ్య పన్నులశాఖ) తదితర 16 రకాల ఉద్యోగాలకు 163 మంది ఎంపికయ్యారు. వీరిలో

Updated : 06 Jul 2022 06:06 IST

 టాపర్‌గా కాకినాడకు చెందిన రాణి సుస్మిత

వచ్చే నెలలో గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లు

వివరాలను వెల్లడించిన ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతంసవాంగ్‌

ఈనాడు, అమరావతి: గ్రూపు-1 ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. డిప్యూటీ కలెక్టర్‌, డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ (వాణిజ్య పన్నులశాఖ) తదితర 16 రకాల ఉద్యోగాలకు 163 మంది ఎంపికయ్యారు. వీరిలో 96 మంది పురుషులు, 67 మంది మహిళలు ఉన్నారు. స్పోర్ట్స్‌ కోటాకు చెందిన రెండు పోస్టుల వ్యవహారం కోర్టులో ఉన్నందున వాటిని భర్తీ చేయలేదు. అర్హతలు కలిగిన వారు లేనందున మరో రెండు అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయలేకపోయినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి తుది తీర్పునకు లోబడి నడుచుకుంటామని ఎంపికైన వారి నుంచి సమ్మతి లేఖలను తీసుకోబోతున్నట్లు వెల్లడించింది. ఈ నెల 12లోగా ఎంపికైన వారు నేరుగా లేదా పోస్టు ద్వారా తమ సమ్మతి తెలపాలని, వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది.

తొలి పది మంది వీరే... నోటిఫికేషన్‌లో పేర్కొన్న 167 పోస్టుల్లో 30 డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులకు ఎంపికైన తొలిపది మంది వివరాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. వీరిలో రాణి సుస్మిత(కాకినాడ జిల్లా) కె.శ్రీనివాసరాజు(అన్నమయ్య జిల్లా), వి.సంజనాసిన్హా(హైదరాబాద్‌), ఎన్‌.రామలక్ష్మి(విజయవాడ), పి.శ్రీలేఖ(అనంతపురం జిల్లా), ఎన్‌.మనోజ్‌రెడ్డి(అన్నమయ్య జిల్లా), కె.మధులత(అనంతపురం), డి.కీర్తి(విశాఖపట్నం), ఎస్‌.భరత్‌నాయక్‌(అనంతపురం), ఎ.సాయిశ్రీ(బళ్లారి) ఉన్నారు.


రచనా నైపుణ్యం ఉండాలి
- సంజనా సింహా, హైదరాబాద్‌,  గ్రూపు-1 మూడో ర్యాంకు

సివిల్స్‌ కంటే గ్రూపు-1 సిలబస్సే ఎక్కువ. ముఖ్యంగా ఏపీ ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ చాప్టర్లను అదనంగా చదవాల్సి వచ్చింది. గ్రూపు-1 కానీ... సివిల్స్‌లో కానీ మెయిన్స్‌కు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలు చూసి, జవాబులు ఎలా రాయాలో ముందుగానే సన్నద్ధం అయ్యాను. రైటింగ్‌ స్కిల్‌ బాగుంటేనే మార్కులు ఎక్కువగా వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని