‘ఈనామ్’కే వాస్తే..!
అయిదేళ్లుగా నీరుగారుతోన్న లక్ష్యం
సిండికేటవుతున్న వ్యాపారులు, ఏజెంట్లు
రైతుకు మద్దతు ధర కూడా దక్కని వైనం
రాష్ట్రంలోని 57 మార్కెట్లలో బయటివారు కొనే అవకాశమే లేదు
జనగామ, సూర్యాపేట జిల్లాల నుంచి ‘ఈనాడు’ ప్రతినిధి: పంటలకు ఆన్లైన్లో ధరలు కోట్ చేసే విధానంతో రైతుల ఆదాయం పెంచాలని ప్రవేశపెట్టిన ‘ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్’(ఈనామ్) అమల్లో నీరుగారుతోంది. ఈ పథకం వచ్చి అయిదేళ్లు దాటినా లక్ష్యం నెరవేరలేదు. వ్యాపారుల కొనుగోలు తీరు మారకపోవడంతో రైతులకు పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. దేశవ్యాప్తంగా మొత్తం వెయ్యి మార్కెట్లను ఈనామ్ ద్వారా ఆన్లైన్లో అనుసంధానం చేసినట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఇందులో 57 మార్కెట్ల అనుసంధానంతో తెలంగాణ 8వ స్థానంలో ఉందని వివరించింది.
ఎలా అమలు చేయాలి
ఈనామ్‌లో అనుసంధానమైన మార్కెట్లకు నిత్యం తెచ్చే పంటల నాణ్యతను పరిశీలించి ప్రతి రైతుకు ఒక లాట్ సంఖ్యను కేటాయిస్తారు. ఈ సంఖ్యతో రైతు, గ్రామం పేరు, పంట వివరాలు, నాణ్యతను ఆన్లైన్లో మార్కెట్ సిబ్బంది నమోదు చేస్తారు. పంట ఫొటోను కూడా అప్లోడ్ చేయాలి. ఈ వివరాలు ఆన్లైన్లో పరిశీలించి దేశవ్యాప్తంగా ఎవరైనా పంటను కొనుగోలు చేయొచ్చు. దీనివల్ల పోటీ ఏర్పడి రైతులకు అధిక ధర వస్తుందని.. ఇదే ఈనామ్ పథక ఉద్దేశమని కేంద్రం అయిదేళ్ల క్రితం తెలిపింది.
ఇలాగేనా అమలుచేసేది
రాష్ట్రంలో మొత్తం 57 మార్కెట్లు ఈనామ్‌లో అనుసంధానమైనా బయటి ప్రాంతాల వారు కొనేందుకు అవకాశమే లేదు. పంట వివరాలు, చిత్రాలు అప్లోడ్ చేయాలంటే దాని నాణ్యతను పరీక్షించే యంత్రాలతో మార్కెట్లో ప్రయోగశాలను ఏర్పాటుచేయాలి. కానీ ఏ మార్కెట్లోనూ పంటను పరీక్షించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం లేదు. ప్రతి మార్కెట్‌కు వచ్చిన పంటను అక్కడి కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు ప్రత్యక్షంగా పరిశీలించి వారిలో వారు ముందుగా మాట్లాడుకుని అంతా సిండికేట్‌గా మారి నిర్ణయించుకున్న ధరలనే ఆన్లైన్లో కోట్ చేస్తున్నారు. ఉదయం 12 గంటల తరవాత మార్కెట్ కార్యాలయం ఏ రైతు పంటకు ఎంత ధర వచ్చిందో ప్రకటిస్తోంది. పైగా ఎక్కువగా మార్కెట్‌కు వచ్చే పంటల వివరాలు ఈనామ్‌లో పెట్టడం లేదు. ఉదాహరణకు వరంగల్ అతి పెద్ద మార్కెట్. అక్కడికి వచ్చే పత్తి, మిరప పంటలను ఈనామ్‌లో పెట్టడం లేదు. దీనివల్ల ధరలను కోట్ చేయడంలో పోటీ పెంచాలనే ప్రధాన లక్ష్యం నెరవేరడం లేదు.
క్వింటాకైనా మద్దతు ధర కోట్ చేయరా!?
ఉదాహరణకు ఈ నెల 1న ఈనామ్‌లో ఉన్న వికారాబాద్ జిల్లాలోని పరిగి వ్యవసాయ మార్కెట్‌కు రైతులు వరి కాటన్దొర సన్నాల రకం ధాన్యం 196 క్వింటాళ్లను అమ్మకానికి తీసుకువచ్చారు. కానీ వీటికి ఆన్లైన్ ద్వారా వ్యాపారులు క్వింటాకు రూ.1,650 నుంచి 1,966 మాత్రమే ధరలను కోట్ చేశారని, అత్యధిక పంటకు మోడల్ ధర రూ.1,757 మాత్రమే వచ్చినట్లు కేంద్ర వ్యవసాయశాఖ తాజా నివేదికలో ప్రకటించింది. వాస్తవానికి వరి ధాన్యానికి మద్దతు ధర క్వింటాకు రూ.1,960 అని కేంద్రం ప్రకటిస్తే అంతకన్నా క్వింటాకు రూ.203 తక్కువగా వచ్చినట్లు ఈనామ్ మోడల్(నమూనా) ధర ఉందని కేంద్రమే వెల్లడించింది. ఎక్కువ పంటకు మద్దతు ధరను వ్యాపారులు కోట్ చేయకపోవడంతో ఈనామ్ అమలుతీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారులు ఇతరులెవరికీ తెలియకుండా సొంతంగా ఎవరికి వారు ధరలను ఆన్లైన్ కోట్ చేస్తే కనీసం మద్దతు ధర కూడా దక్కదా అనేది రైతులు ప్రశ్నిస్తున్నారు.
* ఈనామ్కన్నా ముందున్న పాత పద్ధతిలో మార్కెట్లలో రైతులు తెచ్చిన పంట చుట్టూ వ్యాపారులు నిలబడి వేలం నిర్వహించేవారు. వేలంలో పోటీపడి ధరలు పెంచడం వల్ల కొంతైనా రేటు పెరిగేది. ఇప్పుడు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు సిండికేట్ కావడం వల్ల ముందుగానే తక్కువ ధర వేయాలని వారిలో వారే మాట్లాడుకుని నిశ్శబ్దంగా కోట్ చేస్తుండటంతో చివరికి రైతులకు మద్దతు ధర కూడా రాక నష్టపోతున్నారు.
ఇవేం ఎదురుచూపులు
మార్కెట్లో ఉన్న పంటకు ధరలను ఆన్లైన్లో కోట్ చేసి..మార్కెట్ ఏ రేటును ప్రకటిస్తుందా అని సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట ఎదురుచూస్తున్న వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు వీరు. ఇలా ఎదురుచూడటమంటేనే ఈనామ్ లక్ష్యం నీరుగారుతోందని అర్థం. నిబంధనల ప్రకారం ఏ పంటకు ఎవరు ఎక్కువ ధరను ఆన్లైన్లో కోట్ చేస్తే అదే రేటును రైతు, వ్యాపారి ఫోన్ నంబర్లకు సంక్షిప్త సందేశం ద్వారా తెలపాలి. దాని ప్రకారం ఆ పంటను విక్రయించాలి. కాని వాస్తవంలో వ్యాపారులు ఒక్కటై ధరలు ఆన్లైన్లో కోట్ చేసి, తాము అనుకున్నట్లుగా ప్రకటిస్తారా లేదా అని ఎదురుచూస్తుండటం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Taliban: కాబుల్‌లో మహిళల నిరసన.. హింసాత్మకంగా అణచివేసిన తాలిబన్లు!
-
India News
Tiranga Yatra: తిరంగా యాత్ర పైకి దూసుకెళ్లిన ఆవు.. గాయపడ్డ మాజీ ఉపముఖ్యమంత్రి
-
Sports News
Ross Taylor : ఆ మ్యాచ్‌లో డకౌట్.. రాజస్థాన్ ఫ్రాంచైజీ ఓనర్ నా మొహంపై కొట్టాడు: టేలర్
-
Movies News
Liger: షారుఖ్ సూపర్‌హిట్‌ని గుర్తు చేసిన ‘లైగర్’ జోడీ..!
-
General News
Monkey pox: మంకీపాక్స్ ప్రమాదకరం కాదు కానీ... ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Politics News
Congress: మూడు దశాబ్దాలు కాంగ్రెస్‌కు హోంగార్డును.. ట్విటర్ ప్రొఫైల్‌ను మార్చేసిన ఎంపీ కోమటిరెడ్డి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
- Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
- BJP: ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా రెడీ: జీవితా రాజశేఖర్
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- MS Dhoni : దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో మెంటార్‌గా ధోనీ సేవలు ఈసారికి కష్టమే!
- Uddhav Thackeray: ‘త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం వల్ల దేశ భక్తులు కాలేరు’
- RRR: ఆర్ఆర్ఆర్ టీమ్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన గూగుల్.. ఏం చేసిందంటే?
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- cardiac: ఛాతీలో నొప్పిగా ఉందా..? ఎందుకో తెలుసుకోండి..!