రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌లో డాక్టర్‌ రఘురాంకు గౌరవ సభ్యత్వం

ప్రతిష్ఠాత్మక ‘ది రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌’లో కిమ్స్‌ ఉషాలక్ష్మి రొమ్ము వ్యాధుల చికిత్స కేంద్రం సంచాలకుడు డాక్టర్‌ పి.రఘురాం(55)కు గౌరవ సభ్యత్వం (ఆనరరీ ఫెలోషిప్‌) లభించింది. బుధవారం లండన్‌లో జరిగిన కార్యక్రమంలో

Published : 07 Jul 2022 03:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక ‘ది రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌’లో కిమ్స్‌ ఉషాలక్ష్మి రొమ్ము వ్యాధుల చికిత్స కేంద్రం సంచాలకుడు డాక్టర్‌ పి.రఘురాం(55)కు గౌరవ సభ్యత్వం (ఆనరరీ ఫెలోషిప్‌) లభించింది. బుధవారం లండన్‌లో జరిగిన కార్యక్రమంలో రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ అధ్యక్షుడు ఆచార్య నీల్‌ మోర్టెన్‌సెన్‌ చేతులమీదుగా డాక్టర్‌ రఘురాం ఈ గౌరవాన్ని స్వీకరించారు. శస్త్రచికిత్సల విభాగంలో ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా దీన్ని అందజేసినట్లు డాక్టర్‌ నీల్‌ మోర్టెన్‌సెన్‌ తెలిపారు. భారత్‌ తరఫున ఈ ఫెలోషిప్‌ పొందిన అత్యంత పిన్న వయస్కుడైన సర్జన్‌ డాక్టర్‌ రఘురామే కావడం విశేషం. ఈ సందర్భంగా భారత్‌లో వైద్యసేవల అభివృద్ధి, విలువలు తదితర అంశాలపై డాక్టర్‌ రఘురాం మాట్లాడారు. భారత్‌కు చెందిన శస్త్రచికిత్స నిపుణుడిగా ఈ గౌరవాన్ని అందుకోవడం చాలా గర్వంగా ఉందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని