ఏటా కొత్త బీసీ గురుకులాలు

రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి జిల్లాకొకటి చొప్పున 33 కొత్త బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయనున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఇందుకు ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Published : 07 Jul 2022 06:07 IST

ఈ ఏడాది మరో 15 డిగ్రీ కళాశాలలు: గంగుల

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి జిల్లాకొకటి చొప్పున 33 కొత్త బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయనున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఇందుకు ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ప్రస్తుతం 281 గురుకులాలు ఉన్నాయని, ఏటా కొత్తవి ఏర్పాటు చేస్తూ వీటి సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు, స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ అలోక్‌కుమార్‌, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రితో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది నాలుగు పాఠశాలల్ని జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయనున్నామని, వచ్చే ఏడాది 115 పాఠశాలల్ని జూనియర్‌ కళాశాలలుగా మార్చుతామని వివరించారు. ప్రస్తుతం ఒకటే బీసీ గురుకుల డిగ్రీ కళాశాల ఉండగా, ఈ ఏడాది మరో 15 ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఏకసంఘంగా ఏర్పడిన ఆరు కులాలకు ఈ నెల 8న ఆత్మగౌరవ భవనాల మంజూరు పత్రాలు అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని