భద్రాచలం రామయ్య హుండీ ఆదాయం రూ.1.82 కోట్లు

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని బుధవారం చిత్రకూట మండపంలో లెక్కించారు. 65 రోజులకు రూ.1,82,33,186 వచ్చిందని ఈవో శివాజీ ప్రకటించారు. గడిచిన రెండు నెలల్లో భక్తులు విశేష సంఖ్యలో రావడంతో

Published : 07 Jul 2022 06:07 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని బుధవారం చిత్రకూట మండపంలో లెక్కించారు. 65 రోజులకు రూ.1,82,33,186 వచ్చిందని ఈవో శివాజీ ప్రకటించారు. గడిచిన రెండు నెలల్లో భక్తులు విశేష సంఖ్యలో రావడంతో ఆదాయం గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. వేసవిలో రోజుకు రూ.2 లక్షలు వస్తుందనే అంచనా ఉండగా దీన్ని మించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 130 గ్రాముల బంగారంతో పాటు ఒక కిలో 900 గ్రాముల వెండి సమర్పించారు. అమెరికా డాలర్లు 467, యూఏఈ దిరామ్‌లు 10, సౌదీ రియాళ్లు 5, ఖతర్‌ రియాళ్లు 266, సింగపూర్‌ డాలర్లు 2, బహ్రెయిన్‌ దీనార్లు 10.5, కెనడా డాలర్లు 50, కువైట్‌ దీనార్లు ఒక క్వార్టర్‌, ఇంగ్లండ్‌ పౌండ్లు 10, ఒమన్‌ బైసా 200 కానుకల రూపంలో సమకూరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని