వాణిజ్యపన్నుల శాఖ రాబడి రూ.16,909 కోట్లు

రాష్ట్రంలో 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వాణిజ్యపన్నులశాఖకు రూ.16,909 కోట్ల రాబడి వచ్చింది. గత ఏడాదికంటే పెట్రోలు, మద్యం అమ్మకం పన్నుతో పాటు జీఎస్టీ రాబడులు గణనీయంగా పెరిగాయి. మొదటి మూడు నెలల్లో

Published : 07 Jul 2022 05:49 IST

తొలి త్రైమాసికంలో అంచనామేరకే ఆదాయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వాణిజ్యపన్నులశాఖకు రూ.16,909 కోట్ల రాబడి వచ్చింది. గత ఏడాదికంటే పెట్రోలు, మద్యం అమ్మకం పన్నుతో పాటు జీఎస్టీ రాబడులు గణనీయంగా పెరిగాయి. మొదటి మూడు నెలల్లో పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకం పన్ను ఆదాయంలో 35 శాతం, మద్యం అమ్మకం పన్నులో 24 శాతం, జీఎస్టీ రాబడుల్లో 45 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ శాఖ రాబడిని రూ.69,203 కోట్లు అంచనా వేయగా ఏప్రిల్‌లో రూ.5,527 కోట్లు, మేలో రూ.5,498కోట్లు, జూన్‌లో రూ.5,884 కోట్ల ఆదాయం వచ్చింది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగే కొద్ది అమ్మకం పన్నుపై రాష్ట్రానికి ఆదాయం పెరుగుతూ ఉంది. వీటి అమ్మకాల ద్వారా ఏప్రిల్‌లో రూ.1,206 కోట్లు రాగా మేలో రూ.1,308 కోట్లు, జూన్‌లో రూ.1,381 కోట్ల పన్ను వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని