సున్నా కాదు.. 44 మార్కులు

ఇంటర్‌ బోర్డు తన తప్పును సరిదిద్దుకుంది. జూన్‌ 28న వెల్లడైన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఖమ్మం జిల్లా ముదిగొండ విద్యార్థి భద్రి గోపి ఆంగ్లంలో 70, తెలుగులో 90, చరిత్రలో 93, సివిక్స్‌లో 80 మార్కులు సాధించాడు. ఎకనామిక్స్‌లో

Updated : 07 Jul 2022 10:17 IST

తప్పును సరిదిద్దుకున్న ఇంటర్‌ బోర్డు.. ఉత్తీర్ణుడైన విద్యార్థి

ముదిగొండ, న్యూస్‌టుడే: ఇంటర్‌ బోర్డు తన తప్పును సరిదిద్దుకుంది. జూన్‌ 28న వెల్లడైన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఖమ్మం జిల్లా ముదిగొండ విద్యార్థి భద్రి గోపి ఆంగ్లంలో 70, తెలుగులో 90, చరిత్రలో 93, సివిక్స్‌లో 80 మార్కులు సాధించాడు. ఎకనామిక్స్‌లో మాత్రం సున్నా మార్కులు వచ్చినట్లు చూపి ఫెయిల్‌ మెమో జారీ చేశారు. పరీక్షల్లో పలువురు విద్యార్థులకు మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులొచ్చినా.. ఒక్క సబ్జెక్టులో ‘సున్నా’ రావడంపై ‘‘ఇంటర్‌ ఫలితాల్లో మళ్లీ తప్పులు’’ శీర్షికన గత నెల 29న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన ఇంటర్‌ బోర్డు అధికారులు సున్నా మార్కులు వచ్చిన జవాబుపత్రాలను ఉచితంగా పునఃమూల్యాంకనం చేయాలని నిర్ణయించారు. గోపి ఎకనామిక్స్‌ జవాబుపత్రాలనూ పునఃమూల్యాంకనం చేయించారు. అందులో 44 మార్కులు వచ్చినట్లు నిర్ధారణ కావడంతో.. ఉత్తీర్ణత మెమోను బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని