Published : 07 Jul 2022 05:49 IST

రెవెన్యూ సమస్యలపై 11న సీఎం సమావేశం

పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సదస్సుల నిర్వహణపై ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో మంత్రులు, శాసనసభ్యులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం నిర్వహించనున్నారు. దీనికి హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ లేఖలు రాశారు. ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఎమ్మెల్యేల నేతృత్వంలో సదస్సులు జరుపుతామని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో సదస్సులకు సంబంధించిన కార్యాచరణ ఖరారు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రెవెన్యూ సమస్యలు, అంశాలపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎస్‌ బుధవారం ఆదేశించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని