జేఈఈ మెయిన్స్‌లో రవికిషోర్‌కు 300 మార్కులు!

జేఈఈ మెయిన్స్‌ తొలివిడత ఫలితాల్లో విజయవాడకు చెందిన పెనికలపాటి రవికిషోర్‌కు 300కి 300 మార్కులు దక్కాయి. దాంతో మొదటి ర్యాంకు ఖాయమైంది. జేఈఈ మెయిన్స్‌ మొదటి విడత పరీక్షలు జూన్‌ 23-29 తేదీల మధ్య

Updated : 07 Jul 2022 06:20 IST

తొలి విడత తుది కీ విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్స్‌ తొలివిడత ఫలితాల్లో విజయవాడకు చెందిన పెనికలపాటి రవికిషోర్‌కు 300కి 300 మార్కులు దక్కాయి. దాంతో మొదటి ర్యాంకు ఖాయమైంది. జేఈఈ మెయిన్స్‌ మొదటి విడత పరీక్షలు జూన్‌ 23-29 తేదీల మధ్య జరిగాయి. ఇటీవలే ప్రాథమిక కీ విడుదల చేసిన జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) వాటిపై అభ్యంతరాలను స్వీకరించింది. బుధవారం రాత్రి తుది కీ విడుదల చేసింది. ఆ ప్రకారం రవికిషోర్‌కు 300 మార్కులు వచ్చాయి. దాదాపు 9 లక్షల మంది పరీక్షలు రాశారు. 300 మార్కుల పరీక్షలో కొందరు 300 మార్కులు సాధించారు. తుది కీలో 12 ప్రశ్నలకు జవాబులు మారాయని శ్రీచైతన్య గ్రూపు సంస్థల ఐఐటీ జాతీయ కన్వీనర్‌ ఎం.ఉమాశంకర్‌ తెలిపారు. చివరి విడత పరీక్ష ఈ నెల 21వ తేదీ నుంచి మొదలవుతుంది. తర్వాత రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను విడుదల చేస్తారు. గత ఏడాది మొత్తం 18 మందికి ప్రథమ ర్యాంకు రాగా అందులో తెలుగు విద్యార్థులు ఆరుగురు ఉన్నారు.


ఐఐటీ బాంబేలో పరిశోధనే లక్ష్యం

కానూరు, న్యూస్‌టుడే: ఐఐటీ బాంబేలో కంప్యూటర్స్‌ సైన్స్‌ చదివి పరిశోధనలు చేయడమే తన లక్ష్యమని జేఈఈ మెయిన్స్‌లో 300కు 300 మార్కులు సాధించిన రవికిషోర్‌ పేర్కొన్నారు. అతను గోసాల శ్రీచైతన్యలో ఇంటర్‌ పూర్తిచేసి ప్రస్తుతం జేఈఈ అడ్వాన్సుడుకు శిక్షణ తీసుకుంటున్నారు. గుంటూరుకు చెందిన రవికిషోర్‌ తండ్రి ఆదినారాయణ ప్రైవేటు ఉద్యోగి. తల్లి నందకుమారి ప్రభుత్వ ఉద్యోగి. పదో తరగతిలో జీపీఏ 10, ఇంటర్‌లో 961 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా రవికిషోర్‌ మాట్లాడుతూ.. రోజుకు 16 గంటలు చదవడం, ఎప్పటికప్పుడు సబ్జెక్టుల్లో అనుమానాలు నివృత్తి చేసుకోవడం, ప్రణాళికాబద్ధంగా సాధన చేయడంతో ఈ మార్కులు వచ్చాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని