బీజీ-4 రకం పత్తి విత్తనం సిద్ధం

పత్తిలో కొత్త రకం వంగడం బీజీ-4 రైతులకు అందించడానికి సిద్ధంగా ఉందని బేయర్‌ కంపెనీ ప్రతినిధులు చెప్పారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి బుధవారం వెల్లడించారు.

Published : 07 Jul 2022 05:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: పత్తిలో కొత్త రకం వంగడం బీజీ-4 రైతులకు అందించడానికి సిద్ధంగా ఉందని బేయర్‌ కంపెనీ ప్రతినిధులు చెప్పారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి బుధవారం వెల్లడించారు. అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌లో బేయర్‌ కంపెనీ సాగుచేసిన పత్తి విత్తన పంటను, కంపెనీ జన్యు పరిశోధన కేంద్రాన్ని మంత్రి, ఎమ్మెల్యేల బృందం మంగళవారం సందర్శించి వివరాలు తెలుసుకుంది. మంత్రి వెంట ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, రవీంద్రనాయక్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు తదితరులున్నారు. పత్తి సాగులో పెట్టుబడి వ్యయం తగ్గించడం, ఉత్పాదకత పెంచడం, నూతన సాంకేతికతలను అభివృద్ధి చేసి అధిక సాంద్రతతో పండించే పద్ధతులను అమలుచేస్తున్న అమెరికాలో అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఈ ఏడాది 20 వేల ఎకరాల్లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తున్నందున దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ పర్యటన తోడ్పడుతుందని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని