చిగురిస్తున్న రేషన్‌ ఆశలు

వివిధ కారణాలతో గతంలో రద్దయిన తెల్ల రేషన్‌కార్డుల పునరుద్ధరణకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలగించిన కార్డుదారుల నుంచి ఈ నెల 5 నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరించాలని

Updated : 07 Jul 2022 06:30 IST

రద్దయిన తెల్లకార్డుల పునరుద్ధరణకు సర్కారు ఆదేశాలు

20వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే: వివిధ కారణాలతో గతంలో రద్దయిన తెల్ల రేషన్‌కార్డుల పునరుద్ధరణకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలగించిన కార్డుదారుల నుంచి ఈ నెల 5 నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరించాలని తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖ ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది. 2016లో కేంద్ర సర్కారు ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణలో ప్రభుత్వం అనర్హుల పేరుతో లక్షల తెల్లకార్డులను తొలగించింది. లబ్ధిదారులకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా కార్డులను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ గతేడాది ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కేసును పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని వివరణ కోరి పలు సూచనలు చేసింది. రద్దుచేసిన కార్డులపై పునఃపరిశీలన జరిపి.. వారికి నోటీసులు జారీచేయాలని పేర్కొంది.

వివరాలు వెబ్‌సైట్‌లో..

తొలగించిన జాబితాలో కుమురం భీం జిల్లాలోనే 6860 కార్డులు ఉన్నాయి. ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉంటాయి. వాటి వివరాలను మండలాల వారీగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వెబ్‌సైట్‌లో ఉంచింది. వాటిని ఆయా మండలాల తహసీల్దారులు డౌన్‌లోడ్‌ చేసుకొని సర్వే చేయించాలి. వారు తొలగించిన కార్డుదారులను కలసి, నోటీసులు జారీచేసి వివరాలు సేకరించాలి. ఆ మేరకు అర్హుల కార్డులను ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని కుమురం భీం జిల్లా డీసీఎస్‌వో స్వామికుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని