ఓటీపీ నమోదు చేస్తేనే రూ.10 వేలకు మించి నగదు ఉపసంహరణ

ఖాతాదారులు ఏటీఎం మోసాల బారిన పడకుండా చూసే లక్ష్యంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చర్యలు తీసుకుంటోంది. ఏటీఎంలో రూ.10వేలకు మించి నగదు ఉపసంహరించాలంటే

Updated : 28 Jul 2022 08:37 IST

అమల్లోకి తెచ్చిన ఎస్‌బీఐ

హైదరాబాద్‌: ఖాతాదారులు ఏటీఎం మోసాల బారిన పడకుండా చూసే లక్ష్యంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చర్యలు తీసుకుంటోంది. ఏటీఎంలో రూ.10వేలకు మించి నగదు ఉపసంహరించాలంటే,  వినియోగదారులు తప్పనిసరిగా ‘బ్యాంకులో నమోదైన మొబైల్‌ నంబరు’కు వచ్చే ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఖాతాదారుడి మొబైల్‌కు వచ్చే ఓటీపీని సరిగా నమోదు చేయకపోతే.. ఏటీఎం నుంచి నగదు బయటకు రాదని వెల్లడించింది. ఒక ఓటీపీ ద్వారా ఒకే లావాదేవీ చేసేందుకు వీలవుతుంది.

ఖాతాలో రూ.లక్షకు మించి ఉంటే, అపరిమిత ఉపసంహరణలు

తమ బ్యాంకు ఖాతాలో రూ.లక్షకు మించి నగదు నిల్వ ఉంటే, ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి ఎన్ని సార్లయినా నగదును ఉపసంహరించే వీలుందని తాజా నోటిఫికేషన్‌లో ఎస్‌బీఐ వెల్లడించింది. రూ.లక్ష కంటే తక్కువమొత్తం ఉంటే మాత్రం 5 ఉచిత లావాదేవీలనే అనుమతిస్తారు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి 3 సార్లు మాత్రమే ఉచితంగా అనుమతిస్తారు. అంతకుమించితే ప్రతి లావాదేవీకి ఛార్జి పడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని