తెలుగువర్సిటీ సాహితీ పురస్కారాలకు సూచనలు

తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ రచనల్ని ప్రోత్సహించడానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా సాహితీ పురస్కారాలు ప్రదానం చేస్తోంది. 2020 సంవత్సరానికి ప్రదానం చేసే పురస్కారాల ఎంపికకు పాఠకులు,

Published : 31 Jul 2022 03:54 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ రచనల్ని ప్రోత్సహించడానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా సాహితీ పురస్కారాలు ప్రదానం చేస్తోంది. 2020 సంవత్సరానికి ప్రదానం చేసే పురస్కారాల ఎంపికకు పాఠకులు, రచయితల నుంచి విశ్వవిద్యాలయం సూచనలు కోరుతోంది. వివిధ ప్రక్రియల్లో 2017 జనవరి నుంచి 2019 డిసెంబరు మధ్య కాలంలో తొలిసారిగా ప్రచురణ పొందిన ఉత్తమ గ్రంథాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. రచయిత మరణించినప్పటికీ వారి రచనలు 2017 జనవరి నుంచి 2019 డిసెంబరు మధ్యకాలంలో ప్రచురణ పొంది ఉంటే సూచించవచ్చన్నారు. గేయ కవితల్లో గ్రంథాలు 2015 నుంచి 2019 మధ్య ప్రచురితమై ఉండాలి. సూచనల్లో రచయిత, ప్రక్రియ, గ్రంథం పేరు, చిరునామా, పేజీల సంఖ్య, ప్రచురణసంవత్సరం, ప్రచురణకర్త పేరును పేర్కొనాల్సి ఉంటుంది. అనువాద సాహిత్య విభాగంలో తప్ప మిగతా విభాగాలకు పురస్కారాల కోసం అనువాదాలు, అనుసరణలు ఆమోదం కావని గమనించాలి. కవితా సంపుటాలైతే కనీసం 60 పేజీలు, ఇతర ప్రక్రియల్లో గ్రంథాలు 96 పేజీలకు తగ్గకుండా ఉండాలి. దరఖాస్తులను రిజిస్ట్రార్‌, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌-500004 చిరునామాకు 2022 ఆగస్టు 19లోపు పంపించాల్సి ఉంటుందని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌ ఒక ప్రకటనలో కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని