Published : 06 Aug 2022 03:58 IST

9 నుంచి గాంధీ చిత్ర ప్రదర్శన

రెండు విడతల్లో 10 రోజుల పాటు పిల్లలకు ఉచితం
సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోని విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేందుకు రిచర్డ్‌ అటెన్‌బరో రూపొందించిన గాంధీ చిత్రాన్ని రాష్ట్రంలోని 563 సినిమా థియేటర్లలో పది రోజుల పాటు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. 6 నుంచి 10 తరగతులు చదివే విద్యార్థుల కోసం ఈ నెల 9, 10, 11 తేదీల్లో, ఆ తర్వాత 16 నుంచి 22 వరకు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ఉదయం ఆట (మార్నింగ్‌ షో) ఉంటుందని తెలిపారు. ప్రతి రోజూ 2.77 లక్షల మంది తిలకిస్తారని చెప్పారు. విద్యార్థులను థియేటర్లకు తీసుకెళ్లే రవాణా ఏర్పాట్లను ప్రభుత్వం చేపడుతుందని, వారికి ఉచితంగా మంచినీళ్ల బాటిళ్లు, తినుబండారాలను అందజేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు విద్యార్థులకు చలనచిత్ర ప్రదర్శనపై గురువారం తన కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ నెల 8 నుంచి 22 వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోందని,. ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా ఉంటారని తెలిపారు. చలనచిత్ర ప్రదర్శన షెడ్యూలు కోసం త్వరలో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తాను ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ అనిల్‌ కూర్మాచలం, తెలంగాణ చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీల్‌ నారంగ్‌, అనుపమ్‌రెడ్డి, దామోదర్‌ ప్రసాద్‌, ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు బసిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని