Published : 06 Aug 2022 03:58 IST

రాష్ట్రంలో బోగస్‌ ఓట్ల తొలగింపు తీరు భేష్‌

ఓటర్ల జాబితా సవరణను పర్యవేక్షించిన ఉప ముఖ్య ఎన్నికల కమిషనర్‌ వ్యాస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఒకే ఫొటోతో ఉన్న ఓటర్లను గుర్తించి జాబితా నుంచి వారు పేర్లను తొలగించటంలో తెలంగాణ ఎన్నికల సంఘం తీరు బాగుంది’ అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఉప ముఖ్య ఎన్నికల అధికారి నితీశ్‌కుమార్‌ వ్యాస్‌ కితాబిచ్చారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియతో పాటు నమోదుకు కొత్తగా ఎన్నికల సంఘం రూపొందించిన దరఖాస్తుల అమలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఆయన శుక్రవారం హైదరాబాద్‌ వచ్చారు. అధికారులతో కలసి నూతన విధానాల అమలు తీరుతెన్నులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 10లక్షల మంది బోగస్‌ ఓటర్లను తొలగించటం విశేషం. కొందరు వ్యక్తులు ఒకే ఫొటోతో పలు ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అలాంటి వారిని గుర్తించి తొలగించే ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టింది. తెలంగాణ నుంచి ఎక్కువ మందిని తొలగించగలిగారు. ఓటర్ల జాబితాలో ఆధార్‌ను అనుసంధానించే విధానానికి స్పందన లభించింది. తొలి వారంలో 20వేల మంది ఓటర్లు స్వచ్ఛందంగా ఆధార్‌ సంఖ్యను అనుసంధానం చేసుకున్నారు. ఈ ప్రక్రియను 2023 ఏప్రిల్‌ వరకు అమలుచేస్తాం’ అని పేర్కొన్నారు. జాబితా సవరణ ప్రక్రియ సందర్భంగా ప్రజల సందేహాలను ఎలా నివృత్తి చేస్తున్నారన్నది కూడా నితీశ్‌కుమార్‌ వ్యాస్‌ పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం దక్షిణాది రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షించే ముఖ్య కార్యదర్శి అవినాశ్‌కుమార్‌, తెలంగాణ ఎన్నికల సంఘం అధికారులు సత్యవాణి, రవికిరణ్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిషనర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని