పనులు నిదానం.. ప్రయాణం నరకం..!

మట్టి కుప్పలతో నిండిన ఈ రహదారి ఏ గ్రామంలోనిదో అనుకుంటే పొరపాటే.. నిజంగా ఇది జాతీయ రహదారే. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ, సమీప ప్రాంతాల నుంచి వరద కాలువను ఎదులాబాద్‌ మూసీ

Published : 06 Aug 2022 04:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: మట్టి కుప్పలతో నిండిన ఈ రహదారి ఏ గ్రామంలోనిదో అనుకుంటే పొరపాటే.. నిజంగా ఇది జాతీయ రహదారే. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ, సమీప ప్రాంతాల నుంచి వరద కాలువను ఎదులాబాద్‌ మూసీ వరకు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారి 163 హైదరాబాద్‌- వరంగల్‌ మార్గంలో జోడిమెట్ల వద్ద రెండు కల్వర్టులను సైతం ఆధునికీకరిస్తున్నారు. ఇక్కడ రక్షణ చర్యలు ఏ మాత్రం కనిపించడం లేదు. కొన్ని నెలలుగా పనులు సాగుతుండడంతో ఈ రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నిమిషానికి 60 నుంచి 70 వాహనాలు ప్రయాణించాల్సి ఉండగా ప్రస్తుతం 20 కూడా వెళ్లడం లేదు. వారం కిందట ఇక్కడే ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.  

          

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని