రాయితీ కార్డులను ఆర్టీసీ ప్రవేశపెట్టాలి

ఆర్టీసీ ఆదాయం పెరుగుదలకు ఉపయుక్తంగా ఉండే ప్రయాణికుల రాయితీ కార్డులను తిరిగి ప్రారంభించాలని ఆర్టీసీ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు కోరారు. ఈ విధానం ద్వారా ఆక్యుపెన్సీ

Published : 06 Aug 2022 04:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ ఆదాయం పెరుగుదలకు ఉపయుక్తంగా ఉండే ప్రయాణికుల రాయితీ కార్డులను తిరిగి ప్రారంభించాలని ఆర్టీసీ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు కోరారు. ఈ విధానం ద్వారా ఆక్యుపెన్సీ కూడా పెరుగుతుంది. 2015 నుంచి 2019 వరకు నవ్య, వనిత, విహారి పేరుతో ప్రయాణ ఛార్జీలో పది శాతం రాయితీ ఇచ్చే కార్డులు అమలులో ఉండేవి. వాటిని తిరిగి ప్రవేశ పెట్టడం ద్వారా ఏటా రూ.30 కోట్ల వరకు ఆదాయం పెరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని