ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి

ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని మాదిగ రాజకీయ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న నాయకత్వంలోని ప్రతినిధులు కేంద్ర మంత్రులకు

Published : 06 Aug 2022 04:57 IST

ఈనాడు ,దిల్లీ: ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని మాదిగ రాజకీయ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న నాయకత్వంలోని ప్రతినిధులు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్‌ ముండా, కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత శాఖ సహాయ మంత్రి నారాయణస్వామి, కేంద్ర మత్స్య శాఖ సహాయ మంత్రి మురుగన్‌, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి మహేంద్రబాయిలను శుక్రవారం కలిశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతామని భాజపా హామీ ఇచ్చిందని కేంద్ర మంత్రులకు గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ లేకపోవడంతో మాదిగలు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. కేంద్ర మంత్రులను కలిసిన వారిలో నాయకులు నిడమర్తి సత్తిరాజు, కాండ్రు సుధాకర్‌ బాబు, కంబాల ప్రదీప్‌, చెన్నం శివ నాగరాజు తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని