Published : 06 Aug 2022 04:57 IST

తెలంగాణలో జాతీయ యువజన క్రీడోత్సవాలు నిర్వహించాలి

భారత ఒలింపిక్‌ సంఘ అధ్యక్షునికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వినతి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో జాతీయ యువజన క్రీడోత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోసీ) అధ్యక్షుడు అనిల్‌ ఖన్నాను కోరారు. తెలంగాణ అందుకు అనుకూలంగా ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో  మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. దీనిపై ఖన్నా సానుకూలంగా స్పందించారని సమాచారం. రాష్ట్రంలోని క్రీడా మైదానాలు, మౌలిక సదుపాయాలు, వసతులను పరిశీలించేందుకు నిపుణుల బృందాన్ని పంపిస్తామని, వారి నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్‌ క్రీడోత్సవాల అధ్యయనానికి వెళ్లిన మంత్రి శుక్రవారం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి. జాతీయ హ్యాండ్‌బాల్‌ సమాఖ్య, అధ్యక్షుడు జగన్మోహన్‌రావుతో కలిసి ఐవోసీ అధ్యక్షుడు అనిల్‌ ఖన్నా, కోశాధికారి అందేశ్వర్‌ పాండే, వివిధ క్రీడల జాతీయ సంఘాలు, సమాఖ్యల  అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశమయ్యారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts