పూల అలంకరణ కళానిపుణురాలు రేఖారెడ్డికి జపాన్‌ ప్రభుత్వ పురస్కారం

హైదరాబాద్‌కు చెందిన జపాన్‌ పూలఅలంకరణ (ఒహరా ఇకెబానా) కళానిపుణురాలు గవ్వా రేఖారెడ్డి జపాన్‌ విదేశాంగమంత్రి ప్రశంసా పురస్కారానికి ఎంపికయ్యారు. తమ కళ ద్వారా భారత్‌-జపాన్‌ల మధ్య సాంస్కృతిక మార్పిడి,

Updated : 06 Aug 2022 05:07 IST

త్వరలో చెన్నైలోని కాన్సులేట్‌ కార్యాలయంలో బహూకరణ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన జపాన్‌ పూలఅలంకరణ (ఒహరా ఇకెబానా) కళానిపుణురాలు గవ్వా రేఖారెడ్డి జపాన్‌ విదేశాంగమంత్రి ప్రశంసా పురస్కారానికి ఎంపికయ్యారు. తమ కళ ద్వారా భారత్‌-జపాన్‌ల మధ్య సాంస్కృతిక మార్పిడి, సుహృద్భావ, స్నేహ సంబంధాలకు దోహదపడినందుకు గాను  ఆమె  ఈ పురస్కానికి ఎంపిక చేసినట్లు చెన్నైలోని కాన్సులేట్‌ కార్యాలయం శుక్రవారం వెల్లడించంది. త్వరలో చెన్నైలోని జపాన్‌ కాన్సులేట్‌ కార్యాలయంలో ఈ పురస్కారాన్ని ఆమెకు అందజేస్తారు. జపాన్‌ ప్రభుత్వం తమ దేశానికి అనుబంధ కళలు, సేవలు అందించే వారిని గుర్తించి ప్రతీయేటా పురస్కారాలు అందిస్తుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఫుడ్‌, న్యూట్రిషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన రేఖారెడ్డి తన తల్లి శ్యామల, నిపుణుడైన మీనా అనంతనారాయణ్‌ వద్ద జపాన్‌ పూల అలంకరణ కళను నేర్చుకున్నారు. మూడు దశాబ్దాలుగా ఆమె  దాదాపు పదివేల మందికి శిక్షణ ఇచ్చారు. ఒహరా ఇకెబానా హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఫిక్కీ మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని