KCR: ఆచార్య జయశంకర్‌కు ముఖ్యమంత్రి నివాళి

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ జయంత్యుత్సవాలు ప్రగతిభవన్‌లో శనివారం జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.

Updated : 07 Aug 2022 06:12 IST

ఆయన కలలు సాకారమవుతున్నాయన్న మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌:  తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ జయంత్యుత్సవాలు ప్రగతిభవన్‌లో శనివారం జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, మల్లారెడ్డి, రైతుబంధుసమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. జయశంకర్‌ కలల బాటలోనే తెలంగాణ స్వరాష్ట్రమై ప్రగతి ప్రస్థానంలో సాగుతోందని కేటీ రామారావు తెలిపారు. జయశంకర్‌ జయంతి సందర్భంగా శనివారం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ శ్వాసగా..ధ్యాసగా ఆయన నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకమని ట్విటర్‌లో కొనియాడారు. జయశంకర్‌ చూపిన మార్గం, ఉద్యమ పాఠాలు, చైతన్యం.. యావత్‌ తెలంగాణ సమాజం గుండెల్లో చిరస్మరణీయమని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కమలాకర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు నివాళులు అర్పించారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఆవరణలో జరిగిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. శాసనమండలిలో మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌, విప్‌ ఎమ్మెస్‌ ప్రభాకర్‌, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, శేరి సుభాష్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, భానుప్రసాద్‌, మధు, విఠల్‌, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు నివాళులు అర్పించారు. తెలంగాణభవన్‌లో హోంశాఖమంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, లక్ష్మారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, కార్పొరేషన్ల ఛైర్మన్లు విద్యాసాగర్‌, నగేశ్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీజీవో, టీఎన్జీవో, పీఆర్‌టీయూటీఎస్‌ కార్యాలయాల్లో ఆయా సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, రాజేందర్‌, శ్రీపాల్‌రెడ్డి, సత్యనారాయణ, ప్రతాప్‌, కమలాకర్‌రావులు, తెలంగాణ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఛైర్మన్‌ పద్మాచారి, నిమ్స్‌లో రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మార్తరమేశ్‌ ఆధ్వర్యంలో జయశంకర్‌ జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని