Heavy Rains: రెడ్‌ అలర్ట్‌.. నేటి నుంచి 3 రోజులు అతి భారీవర్షాలు

బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరంలో శనివారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ఆదివారానికి అది మరింత తీవ్రమయ్యే సూచనలున్నాయని, ప్రజలంతా

Published : 07 Aug 2022 06:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరంలో శనివారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ఆదివారానికి అది మరింత తీవ్రమయ్యే సూచనలున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రెడ్‌అలర్ట్‌ హెచ్చరిక జారీ చేసినట్లు ఆమె చెప్పారు. అల్పపీడనానికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించిందన్నారు.

దీని ప్రభావంతో తెలంగాణలో ఆది, సోమ, మంగళవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో కొద్ది గంటల్లోనే కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని, వర్షాలు పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఆమె వివరించారు. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా అక్కెనపల్లి(పెద్దపల్లి జిల్లా), పాత మంచిర్యాలలో 9.2, వంకులం(కుమురంభీం)లో 7.3, అర్నకొండ(కరీంనగర్‌)లో 6.1, కారేపల్లి(ఖమ్మం)లో 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉష్ణోగ్రత సాధారణంకన్నా 3 డిగ్రీల వరకూ తగ్గడంతో చల్లని వాతావరణం ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని