54 ఏళ్ల వరకు నమోదుకు అవకాశం
ఉపాధి కల్పన కార్యాలయాల్లో 54 ఏళ్ల వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ మేరకు ఉపాధి కల్పన కార్యాలయాల ద్వారా ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్ల
65 ఏళ్లు వచ్చే దాకా రెన్యువల్
ఉపాధి కల్పనకు పేర్ల నమోదులో మార్పులు
ఈనాడు, హైదరాబాద్: ఉపాధి కల్పన కార్యాలయాల్లో 54 ఏళ్ల వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ మేరకు ఉపాధి కల్పన కార్యాలయాల ద్వారా ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్ల నమోదుకు జీవోనం.193 (27.06.1994)లో ప్రభుత్వం సవరణలు చేసింది. గతంలో ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకునేందుకు జులై 1 నాటికి 14 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వయసు ఉండాలి. తాజా సవరణ మేరకు పుట్టిన తేదీ నాటికి 14 నుంచి 45 ఏళ్లలోపు ఉండాలి. ఒకసారి పేరు నమోదు చేసుకున్న తరువాత ప్రతి మూడేళ్లకోసారి పేరును రిజిస్టరులో పునరుద్ధరించుకోవాల్సి వచ్చేది. ఇక నుంచి పుట్టిన తేదీ ప్రామాణికంగా 54 ఏళ్లు వచ్చే వరకు ఆ అభ్యర్థి పేరు, ఉపాధికార్డు రిజిస్టరులో కొనసాగుతుంది. ఉపాధి కల్పన కార్డులో పేర్కొన్న తేదీన కార్డును పునరుద్ధరించుకోవాలి. పునరుద్ధరణకు ఏడాది గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అభ్యర్థికి 54 ఏళ్లు దాటిన తరువాత ప్రతి మూడేళ్ల కోసారి 65 ఏళ్ల వయసు వచ్చే వరకు కార్డును పునరుద్ధరించుకోవచ్చు. 65 ఏళ్లు దాటిన వెంటనే అభ్యర్థిపేరు ఉపాధి కల్పన లైవ్ రిజిస్టరు నుంచి తొలగిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్