వచ్చే వారం ఎంసెట్‌ ఫలితాలు

ఎంసెట్‌ ఫలితాలను వచ్చే వారం విడుదల చేస్తామని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. దోస్త్‌ సీట్ల కేటాయింపు సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. జోసా కౌన్సెలింగ్‌తో ముడిపడి ఉన్నందున ఈసారి

Published : 07 Aug 2022 04:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ ఫలితాలను వచ్చే వారం విడుదల చేస్తామని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. దోస్త్‌ సీట్ల కేటాయింపు సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. జోసా కౌన్సెలింగ్‌తో ముడిపడి ఉన్నందున ఈసారి నవంబరు 1 నుంచి ఇంజినీరింగ్‌ తరగతులను ప్రారంభిస్తామని  తెలిపారు.  ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు 1.56 లక్షలు, అగ్రికల్చర్‌కు 80 వేలమంది హాజరయ్యారన్నారు. డిగ్రీ తరగతులు అక్టోబరు 1 నుంచి మొదలవుతాయన్నారు.

మూడు విడతల కౌన్సెలింగ్‌

ఎంసెట్‌ ఫలితాలు వెలువడిన నాటి నుంచి వారం పదిరోజుల్లో ఎంసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌ను మొదలుపెట్టాలని శుక్రవారం జరిగిన ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఈక్రమంలో జేఎన్‌టీయూహెచ్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు ఆయా ప్రైవేట్‌ కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తిచేసి సిద్ధంగా ఉండాలని నవీన్‌ మిత్తల్‌ సూచించినట్లు సమాచారం. మొదట రెండు విడతల కౌన్సెలింగ్‌ను ముగించాలని, చివరి విడతను ఐఐటీ, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశానికి జోసా కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని