1.11 లక్షల బీటెక్‌ సీట్లకు ఏఐసీటీఈ అనుమతి

రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2022-23)లో 1,11,147 బీటెక్‌ సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. మొత్తం సీట్లలో 35వేలు తప్ప మిగిలినవన్నీ కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ సంబంధిత సీట్లే కావడం

Updated : 07 Aug 2022 06:03 IST

35 వేలు మినహా మిగతావన్నీ కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీకి చెందినవే

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2022-23)లో 1,11,147 బీటెక్‌ సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. మొత్తం సీట్లలో 35వేలు తప్ప మిగిలినవన్నీ కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ సంబంధిత సీట్లే కావడం గమనార్హం. గత ఏడాది 192 ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో 1,11,728 సీట్లు, 2020-21లో 201 కళాశాలల్లో 1,11,143 సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. కళాశాలల సంఖ్యలో ఈసారి మార్పులేదని సాంకేతిక విద్యాశాఖ పేర్కొంది. ఈసారి డిమాండ్‌ లేని 7,380 సీట్లను రద్దు చేసుకున్న కళాశాలలు.. వాటి స్థానంలో 7,815 కొత్త సీట్లకు అనుమతి పొందాయి. ఏఐసీటీఈ మంజూరు చేసినా ఆయా కళాశాలలను తనిఖీ చేసి అనుమతి ఇచ్చే తుది నిర్ణయం విశ్వవిద్యాలయాలదే. దాంతో ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన సీట్ల కంటే కొన్ని వేల సీట్లు తగ్గే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని