పల్లెల్లో రైతుమిత్రలే ఇక పశువైద్యులు

గ్రామీణ ప్రాంతాలలో పశువులకు ఏ సమస్యలు వచ్చినా వెంటనే వైద్యం అందించేలా మహిళా సంఘాల సభ్యుల(రైతుమిత్రల)ను సిద్ధం చేస్తున్నామని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

Published : 07 Aug 2022 04:53 IST

గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాలలో పశువులకు ఏ సమస్యలు వచ్చినా వెంటనే వైద్యం అందించేలా మహిళా సంఘాల సభ్యుల(రైతుమిత్రల)ను సిద్ధం చేస్తున్నామని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ(టీఎస్‌ఐఆర్డీ)లో వివిధ జిల్లాల నుంచి ఎంపిక చేసిన మహిళా సంఘాల సభ్యులకు నిర్వహించిన ‘పశువులలో- ప్రాథమిక చికిత్స’ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలకు శిక్షణ ఇవ్వడం ద్వారా గ్రామాలలో ఆర్‌ఎంపీల తరహాలో వారు పశువైద్యుల పాత్ర పోషించగలరన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉందన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలు గ్రామీణ ప్రాంతాలలో పశువులకు ఎలాంటి వ్యాధులు వచ్చినా ప్రాథమిక చికిత్స అందించాలని సూచించారు.

వైట్బిర్డ్‌ సంస్థతో అవగాహన ఒప్పందం

మహిళ స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేస్తున్న ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కల్పించేలా వైట్ బిర్డ్‌ ఇంపోర్ట్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ కంపెనీతో ‘సెర్ప్‌‘ సంస్థ మంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని