విద్యుత్తు సవరణ బిల్లును నిరసిస్తూ రేపు విధులకు దూరం

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో విద్యుత్తు సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ నెల 8న దేశ వ్యాప్తంగా విద్యుత్తు ఉద్యోగులు విధులకు దూరంగా ఉంటున్నట్లు తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల ఐకాస తెలిపింది. సబ్‌స్టేషన్లలో

Published : 07 Aug 2022 04:53 IST

తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల ఐకాస

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో విద్యుత్తు సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ నెల 8న దేశ వ్యాప్తంగా విద్యుత్తు ఉద్యోగులు విధులకు దూరంగా ఉంటున్నట్లు తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల ఐకాస తెలిపింది. సబ్‌స్టేషన్లలో రాత్రి విధుల్లో ఉన్న వారు మినహా మరెవ్వరూ విధులకు హాజరు కారని స్పష్టం చేసింది. విద్యుత్తు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ శనివారం హైదరాబాద్‌ మింట్‌కాంపౌండ్‌లోని ఎస్పీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం వద్ద ఐకాస ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా బిల్లు ప్రతులను దహనం చేసి పెద్ద ఎత్తున నినదించారు. ఐకాస ఛైర్మన్‌ సాయిబాబు, కన్వీనర్‌ రత్నాకర్‌రావు తదితరులు మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని