ఇందూరు నయాగారా..!

ఎత్తులో ఉన్న అలుగుపై నుంచి పడుతున్న నీరు చిన్నపాటి జలపాతాన్ని తలపిస్తోంది కదా.. ఇది నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి మండలం సిర్నాపల్లిలోని జానకీబాయి చెరువు వద్ద దృశ్యం. చుట్టూ దట్టమైన అడవి.. మధ్యలో

Published : 07 Aug 2022 04:53 IST

ఈనాడు, నిజామాబాద్‌: ఎత్తులో ఉన్న అలుగుపై నుంచి పడుతున్న నీరు చిన్నపాటి జలపాతాన్ని తలపిస్తోంది కదా.. ఇది నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి మండలం సిర్నాపల్లిలోని జానకీబాయి చెరువు వద్ద దృశ్యం. చుట్టూ దట్టమైన అడవి.. మధ్యలో చెరువు.. 40 అడుగుల ఎత్తుతో దీనికి అలుగు ఉంటుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇక్కడ అలుగు పారుతోంది. పైనుంచి పడుతున్న జలధారలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. స్నానాలు చేస్తూ.. కేరింతలు కొడుతూ ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తున్నారు. ఇక్కడికి చేరుకోవాలంటే అడవిలో 3 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి పర్యాటక ప్రాంతంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని