‘డీఅడిక్షన్‌’ పిటిషన్‌పై ఆరేళ్లయినా స్పందించరా?: హైకోర్టు

మద్య వ్యసన విముక్తి (డీఅడిక్షన్‌) కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లో ఆరేళ్లయినా ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి

Published : 07 Aug 2022 04:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: మద్య వ్యసన విముక్తి (డీఅడిక్షన్‌) కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లో ఆరేళ్లయినా ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని, లేని పక్షంలో ఎక్సైజ్‌, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శులు.. ప్రజారోగ్యశాఖ, వైద్యవిద్య డైరెక్టర్లు ఈ నెల 25న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. మద్య వ్యసన విముక్తి కేంద్రాల ఏర్పాటుకు 2013లో జీవో ఇచ్చినా అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది మామిడి వేణుమాధవ్‌ 2016లో వ్యక్తిగత (పార్టీ ఇన్‌ పర్సన్‌) హోదాలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టి.. ఈ ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని