KCR: నేటి నుంచి స్వతంత్ర భారత వజ్రోత్సవాలు
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు సోమవారం నుంచి ఆరంభం కానున్నాయి. తొలిరోజు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరిగే
హెచ్ఐసీసీలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
రేపటి నుంచి రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు
21న శాసనసభ ప్రత్యేక సమావేశం
ఈనాడు, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు సోమవారం నుంచి ఆరంభం కానున్నాయి. తొలిరోజు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరిగే భారీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వీటిని ప్రారంభిస్తారు. శాసనసభాపతి, మండలి ఛైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, నగరపాలక మేయర్లు, పురపాలక ఛైర్పర్సన్లు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 85 మంది వీణ కళాకారులతో దేశభక్తి గీతాలు, ఇసుక కళ (సాండ్ ఆర్ట్)లో స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు, మహిళా యోధుల జీవితాలపై పద్మశ్రీ అలేఖ్య పుంజల ఆధ్వర్యంలో నృత్యప్రదర్శన, లేజర్‌షో, దేశభక్తి గీతాల ప్రదర్శనలుంటాయి. స్వతంత్ర వజ్రోత్సవాలపై కేసీఆర్ సందేశమిస్తారు. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన షెడ్యూలును ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రభుత్వం 1.2 కోట్ల జెండాలను పంపిణీ చేయనుంది. ఈ నెల 9 నుంచి 21 వరకు రాష్ట్రంలో 562 సినిమా హాళ్లలో ఉదయం పూట పాఠశాలల విద్యార్థుల కోసం రిచర్డ్ అటెన్‌బరో నిర్మించిన ‘గాంధీ’ చిత్రాన్ని ప్రదర్శిస్తారు. ఈ నెల 21న శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 15నుంచి పింఛనుకార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
రాష్ట్రంలో నిర్వహించే రోజువారీ కార్యక్రమాలు
* ఆగస్టు 8న స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం ప్రారంభోత్సవం
* 9 నుంచి ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ
* 10న గ్రామ గ్రామాన మొక్కలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు
* 11న ఫ్రీడంరన్ నిర్వహణ
* 12న రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ మీడియా సంస్థల ద్వారా ప్రత్యేక వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలు
* 13న విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాల భాగస్వామ్యంతో వజ్రోత్సవ ర్యాలీలు
* 14న సాయంత్రం సాంస్కృతిక సారథి కళాకారులతో నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక జానపద కార్యక్రమాలు. ప్రత్యేకంగా బాణసంచాతో వెలుగులు..
* 15న గోల్కొండ కోటతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలు
* 16న ఏకకాలంలో ఎక్కడివారక్కడ.. తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాలు
* 17న రక్తదాన శిబిరాలు
* 18న ఫ్రీడంకప్ క్రీడా పోటీలు
* 19న దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల్లో, జైళ్లలో పండ్లు, స్వీట్ల పంపిణీ
* 20న దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని ప్రకటించే విధంగా ముగ్గుల పోటీలు
* 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు
* 22న ఎల్బీస్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్‌కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్‌నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్‌లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్‌కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్‌కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్‌కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్‌ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్‌రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్‌తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్‌డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
-
పార్ట్‌టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్