Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రమై ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంపై ఉందని వాతావరణశాఖ ఆదివారం తెలిపింది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించింది.

Published : 08 Aug 2022 07:00 IST

వాతావరణశాఖ హెచ్చరిక

ఈనాడు, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రమై ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంపై ఉందని వాతావరణశాఖ ఆదివారం తెలిపింది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించింది. మరోవైపు రుతుపవనాల ద్రోణి రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ నుంచి అల్పపీడనం ప్రాంతం వరకూ వ్యాపించింది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. కొద్దిగంటల్లోనే కుంభవృష్టి మాదిరిగా వర్షాలు కురిసే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలోని 484 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా ములకచర్ల(నల్గొండ జిల్లా)లో 10.6, పిప్పల్‌ధరి(ఆదిలాబాద్‌)లో 5.9, కన్నాయిగూడెం(ములుగు)లో 5.1, బెజ్జూరు(కుమురం భీం)లో 4.9. పెద్దంపేట(జయశంకర్‌)లో 4.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని