యాదాద్రి జిల్లా వాసులకు జాతీయ చేనేత పురస్కారాల ప్రదానం

చేనేత కళను నమ్ముకుని కొన్ని దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక చేనేత కళాకారులు కొలను పెద్దవెంకయ్య, ఆయన కుమారుడు రవీందర్‌లు జాతీయ హస్తకళల

Published : 08 Aug 2022 04:38 IST

చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయణపురం, న్యూస్‌టుడే: చేనేత కళను నమ్ముకుని కొన్ని దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక చేనేత కళాకారులు కొలను పెద్దవెంకయ్య, ఆయన కుమారుడు రవీందర్‌లు జాతీయ హస్తకళల పురస్కారాన్ని అందుకున్నారు. ఆదివారం రాత్రి దిల్లీలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, జౌళి శాఖ సహాయ మంత్రి దర్శనావిక్రమ్‌ జర్దోష్‌ల చేతుల మీదుగా స్వీకరించారు. వీరిద్దరూ కలిసి పది నెలల పాటు శ్రమించి మగ్గంపై నేసిన ‘తేలియా రుమాల్‌ డబుల్‌ ఇక్కత్‌ చీర’ను చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో 2018 సంవత్సరానికి చేనేత కళాకారుల విభాగంలో పురస్కారానికి ఎంపిక చేసింది.  

‘మార్కెటింగ్‌ విభాగం’లో పుట్టపాకకు చెందిన చేనేత వస్త్ర వ్యాపారి గజం భగవాన్‌ పీయూష్‌ గోయల్‌, దర్శనా జర్దోష్‌ నుంచి జాతీయ పురస్కారాన్ని స్వీకరించారు. మార్కెటింగ్‌ విభాగంలో ప్రవేశపెట్టిన పురస్కారానికి 2018 సంవత్సరానికి ఎంపికైన భగవాన్‌ ‘నీహారిక సిల్క్‌ శారీస్‌’ పేరుతో హైదరాబాద్‌లో చేనేత వస్త్రాల వ్యాపారం నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని