యాదాద్రిలో పవిత్రోత్సవాలకు శ్రీకారం

యాదాద్రిలో పునర్‌నిర్మితమైన ప్రధానాలయంలో ఆదివారం సాయంత్రం పాంచరాత్రాగమశాస్త్ర రీత్యా పవిత్రోత్సవాలు మొదలయ్యాయి. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ ఈవో గీత తెలిపారు.

Updated : 08 Aug 2022 06:19 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రిలో పునర్‌నిర్మితమైన ప్రధానాలయంలో ఆదివారం సాయంత్రం పాంచరాత్రాగమశాస్త్ర రీత్యా పవిత్రోత్సవాలు మొదలయ్యాయి. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ ఈవో గీత తెలిపారు. ఆలయంలో నిత్యం నిర్వహించే మొక్కు పూజలు, ఆస్థాన కైంకర్యాలలో ఏమైనా దోషాలు దొర్లితే వాటి నివారణకు మూడురోజులు వేడుకలు నిర్వహిస్తారు. విష్వక్సేన పూజతో మొదలైన ఉత్సవాలు మంగళవారం పవిత్రల ధారణ పర్వంతో ముగుస్తాయని ఆలయ ప్రధాన పూజారి లక్ష్మీనరసింహాచార్య చెప్పారు. ఈ ఉత్సవాల సందర్భంగా సోమ, మంగళవారాల్లో నిత్య కల్యాణం, శ్రీసుదర్శన హోమాల నిర్వహణ ఉండదని ఆలయ ఈవో వెల్లడించారు.


దాతలకు వసతి గదుల అప్పగింత

యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొండకింద గల తులసీతోట ప్రాంగణంలో నిర్మితమైన వసతి గదులను శ్రీయాదగిరి లక్ష్మీనర్సింహస్వామి దేవస్థాన అధికారులు ఆదివారం దాతలకు అప్పగించారు. రూ.21 కోట్ల వ్యయంతో నిర్మించిన 242 గదులను ఆర్థికంగా సహకరించిన దాతలకు దైవదర్శనం చేయించి, ఆశీర్వచనాల మధ్య ఆలయ ఈవో గీత అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని