అరకొర పుస్తకాలతో చదువులెలా?

ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 50 రోజులు అవుతున్నా విద్యార్థులకు 50% పాఠ్యపుస్తకాలు కూడా అందలేదు. దీంతో ఖమ్మంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కొత్త, పాత పుస్తకాలతో కొందరు, ఒకే

Published : 08 Aug 2022 05:37 IST

ఈనాడు, ఖమ్మం; న్యూస్‌టుడే, ఖమ్మం విద్యావిభాగం: ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 50 రోజులు అవుతున్నా విద్యార్థులకు 50% పాఠ్యపుస్తకాలు కూడా అందలేదు. దీంతో ఖమ్మంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కొత్త, పాత పుస్తకాలతో కొందరు, ఒకే పుస్తకంతో ఇద్దరు ముగ్గురు చదువులు కొనసాగిస్తున్నారు. గురుకుల వసతి గృహాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉపాధ్యాయులు ఏటా పరీక్షలు అవగానే తరగతుల వారీగా విద్యార్థుల నుంచి పుస్తకాలు సేకరించి.. తరువాత సంవత్సరం విద్యార్థులకు అందజేస్తున్నారు. దీంతో కొంత ప్రయోజనం చేకూరుతున్నా.. అవికూడా అరకొరగానే ఉంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని