నిత్యం చేనేత వస్త్రాలే: స్మితాసభర్వాల్‌ ప్రతిన

సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితాసభర్వాల్‌ తాను నిత్యం చేనేత వస్త్రాలు ధరిస్తానని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నట్లు ఆదివారం ట్విటర్‌లో తెలిపారు. ఈ ప్రతిజ్ఞలో చేనేత ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌,

Published : 08 Aug 2022 05:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితాసభర్వాల్‌ తాను నిత్యం చేనేత వస్త్రాలు ధరిస్తానని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నట్లు ఆదివారం ట్విటర్‌లో తెలిపారు. ఈ ప్రతిజ్ఞలో చేనేత ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌, ఐపీఎస్‌ అధికారిణి షికాగోయల్‌ తదితరులను కూడా భాగస్వామ్యం చేశారు. ఈ సవాలును స్వీకరించిన.. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌.. పోచంపల్లి దుస్తులు ధరించిన ఫొటోను ట్వీట్‌ చేశారు.  అనంతరం క్రీడాకారిణి పీవీ సింధు, నటుడు వెంకటేశ్‌, మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌కు ట్యాగ్‌ చేశారు. స్మిత ఛాలెంజ్‌ను స్వీకరించిన షికాగోయల్‌, జయేశ్‌ రంజన్‌లు తమ వ్యక్తిగత ఖాతాల్లో చేనేత దుస్తులు ధరించిన ఫొటోలను ట్వీట్‌ చేశారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని