వనజీవి దాతృత్వం.. అందిపుచ్చుకోని అటవీశాఖ

ఖమ్మం గ్రామీణ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య తన చేలో పెంచిన ఎర్రచందనం చెట్లను నరికి కలపగా మార్చి హరితనిధి కింద ప్రభుత్వానికి

Published : 08 Aug 2022 06:20 IST

ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: ఖమ్మం గ్రామీణ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య తన చేలో పెంచిన ఎర్రచందనం చెట్లను నరికి కలపగా మార్చి హరితనిధి కింద ప్రభుత్వానికి వితరణగా అందజేస్తానని ఈ ఏడాది జనవరి 18న ప్రకటించారు. కలప 20 టన్నుల వరకు ఉంటుందని హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ను కలిసిన సందర్భంగా రామయ్య వెల్లడించారు. ఎంపీ ఆదేశాలతో అటవీశాఖ అధికారులు హడావుడి చేశారు. రామయ్య ఇంటికి వచ్చి ఎర్రచందనం కలపను పరిశీలించారు. దుంగలకు నంబర్లు కూడా వేశారు. త్వరలోనే వాటిని ప్రభుత్వ టింబర్‌ డిపోనకు తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు. కానీ సుమారు ఆరు నెలలు గడుస్తున్నా.. అధికారులు ఎవరూ అటువైపు తొంగిచూడలేదు. అటవీశాఖ అధికారులను ఎన్నిసార్లు అడిగినా ఎవరూ స్పందించడం లేదని, విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని రామయ్య పేర్కొన్నారు. ఖమ్మం ఇన్‌ఛార్జి డీఎఫ్‌వో రంజిత్‌ మాట్లాడుతూ ఎర్రచందనం కలపను త్వరలోనే హైదరాబాద్‌ ప్రభుత్వ డిపోనకు తరలిస్తామని చెప్పారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని