గ్రామానికి చేరాలంటే తప్పదు ఈ ప్రయాణం!

ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలంలోని కొత్తపల్లి గ్రామస్థులు నిత్యావసర సరకులు ఇంటికి తీసుకెళ్లాలంటే నిత్యం సాహసించాల్సిన పరిస్థితులున్నాయి. ఈ గ్రామంలో 70 కుటుంబాలు

Published : 08 Aug 2022 06:20 IST

ఈనాడు, ఆదిలాబాద్‌, -న్యూస్‌టుడే, బజార్‌హత్నూర్‌: ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలంలోని కొత్తపల్లి గ్రామస్థులు నిత్యావసర సరకులు ఇంటికి తీసుకెళ్లాలంటే నిత్యం సాహసించాల్సిన పరిస్థితులున్నాయి. ఈ గ్రామంలో 70 కుటుంబాలు నివసిస్తుండగా 300 జనాభా ఉంటుంది. మండల కేంద్రానికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామానికి చేరాలంటే మధ్యలో బండ్రెవ్‌ వాగు దాటాలి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ వాగు జోరుగా పారుతోంది. ఇటీవల సుమారు 30 మంది గ్రామస్థులు బజార్‌హత్నూర్‌లోని చౌకధరల దుకాణం నుంచి తీసుకున్న బియ్యం మూటలతో.. వాగులో ఇలా ఒక్కో అడుగేస్తూ ప్రమాదకరంగా దాటుతున్నారు. ఏ మాత్రం అదుపు తప్పినా సరకులు నీళ్ల పాలవడంతో పాటు ప్రాణాలకూ ప్రమాదమే. కనీసం రోడ్డు, వంతెన సదుపాయాలు లేక ఇలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నట్లు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని