హైదరాబాదీ బిరియానీ కోసం సేంద్రియ బియ్యం

హైదరాబాద్‌ ధమ్‌కా బిరియానీని దేశవిదేశీయులు ఎంతో ఇష్టపడి తింటారు. పొడవైన గింజ, సువాసన గల బాస్మతి బియ్యానికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంటుంది. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం గన్నారం గ్రామానికి చెందిన రైతు

Published : 08 Aug 2022 06:20 IST

ఈనాడు, వరంగల్‌: హైదరాబాద్‌ ధమ్‌కా బిరియానీని దేశవిదేశీయులు ఎంతో ఇష్టపడి తింటారు. పొడవైన గింజ, సువాసన గల బాస్మతి బియ్యానికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంటుంది. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం గన్నారం గ్రామానికి చెందిన రైతు ఒంటెల విశ్వేశ్వర్‌రెడ్డి సేంద్రియ విధానంలో బాస్మతి బియ్యాన్ని పండిస్తూ కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. ఈయన ప్రాణహిత, నవారా, కృష్ణవేహి లాంటి రకాల బియ్యంతో పాటు 8 ఎకరాల్లో మామిడితోట, పసుపు, పెసలు, కందులను ప్రకృతిహితంగా సాగు చేస్తున్నారు. వరంగల్‌, హైదరాబాద్‌లో ఉండేవారు విశ్వేశ్వర్‌రెడ్డి వద్ద వీటిని కొనుగోలు చేస్తారు. ఒకప్పుడు తాను కూడా రసాయన ఎరువులతో సాగు చేసేవాడినన్నారు. తన తల్లి క్యాన్సర్‌తో కన్నుమూయడంతో ప్రకృతి సేద్యంవైపు మళ్లానని చెబుతున్నారు. ఇప్పుడు పండించిన బాస్మతి బియ్యం ధర కిలో రూ.200 వరకు పలుకుతుందని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. సాగులో లాభం కన్నా తన పంటల వల్ల 10 మంది ఆరోగ్యంగా ఉంటారనే సంతృప్తే ఎక్కువని ఈ ప్రకృతి రైతు చెబుతున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని