యాదాద్రిలో సంప్రదాయ హంగులతో అతిథి గృహం

యాదాద్రి పుణ్యక్షేత్రంలో తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా యాదర్షి అతిథిగృహం తుదిరూపు దిద్దుకుంటోంది. క్షేత్రాభివృద్ధిలో భాగంగా కొండ కింద పెద్దగుట్టపై యాదాద్రి

Published : 08 Aug 2022 06:20 IST

న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట: యాదాద్రి పుణ్యక్షేత్రంలో తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా యాదర్షి అతిథిగృహం తుదిరూపు దిద్దుకుంటోంది. క్షేత్రాభివృద్ధిలో భాగంగా కొండ కింద పెద్దగుట్టపై యాదాద్రి దేవాలయాభివృద్ధి ప్రాధికార సంస్థ(యాడా) దీన్ని నిర్మిస్తోంది. రాష్ట్ర సంస్కృతికి ప్రతిబింబంగా ఈ క్షేత్ర విశిష్టతను మరింత పెంచేలా నాలుగు పడక గదులు, విశాలమైన సమావేశం హాల్‌తో రూపొందుతోంది. దీన్ని ఆలయ సందర్శనకు వచ్చే వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన వీఐపీల విడిది కోసం కేటాయించేందుకు యాడా యంత్రాంగం యోచిస్తోంది. 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన భవంతి చుట్టూ పచ్చదనం ఉండేలా ఏర్పాటు చేశారు. యాదవ మహర్షి శిలావిగ్రహాన్ని నెలకొల్పారు. వివిధ రకాల చేతివృత్తుల వారి ద్వారా యాదర్షి అతిథిగృహాన్ని తీర్చిదిద్దుతున్నట్లు యాడా వైస్‌ ఛైర్మన్‌ కిషన్‌రావు తెలిపారు. త్వరలో సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.           

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని