Hyderabad: ఆధునిక వసతులతో ‘రిచ్‌మాంట్‌’ ప్రాజెక్టు

నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ‘హానర్‌’ హోమ్స్‌ సంస్థ జూబ్లీహిల్స్‌, హైటెక్‌సిటీ సమీపంలో ఆధునిక వసతులతో నిర్మించనున్న ‘రిచ్‌మాంట్‌’ ప్రాజెక్టును సోమవారం రాత్రి సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌, సినీ నటుడు అల్లు అర్జున్‌

Updated : 09 Aug 2022 04:50 IST

ప్రారంభించిన అల్లు అర్జున్‌

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ‘హానర్‌’ హోమ్స్‌ సంస్థ జూబ్లీహిల్స్‌, హైటెక్‌సిటీ సమీపంలో ఆధునిక వసతులతో నిర్మించనున్న ‘రిచ్‌మాంట్‌’ ప్రాజెక్టును సోమవారం రాత్రి సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌, సినీ నటుడు అల్లు అర్జున్‌ బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌కృష్ణాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సంస్థ నిర్వాహకులతో తనకు ఎన్నో ఏళ్ల పరిచయం ఉందని, కార్యక్రమానికి తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. ‘రిచ్‌మాంట్‌’ ప్రాజెక్ట్‌ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం ‘రిచ్‌మాంట్‌’ లుక్‌ బుక్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో హానర్‌ హోమ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై.స్వప్నకుమార్‌, హానర్‌ హోమ్స్‌ కో-ఫౌండర్స్‌, ప్రమోటర్స్‌ ఎం.బాలుచౌదరి, పి.వెంకటేశ్వర్లు, ఎస్‌.రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 

అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మిస్తున్నాం

నిర్మాణ రంగంలో, సదుపాయాల కల్పనలో తమ సంస్థ అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తోందని ‘హానర్‌ హోమ్స్‌’ ప్రతినిధులు తెలిపారు. ఏడేళ్లుగా ప్రగతి బాటలో పయనిస్తూ ఇప్పటికే ‘హానర్‌ వివాంటిస్‌’ ప్రాజెక్టు పూర్తి చేసి కస్టమర్లకు అందించినట్లు పేర్కొన్నారు. మెగా వెంచర్‌ ‘హానర్‌ అక్వాంటిస్‌’ ప్రాజెక్టు అతి త్వరలో పూర్తి కానుందని  తెలిపారు. తాజాగా జూబ్లీహిల్స్‌, హైటెక్‌సిటీకి సమీపంలో ‘రిచ్‌మాంట్‌’ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. 28.4 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి ఆధునిక సదుపాయాలతో 142 డిజైన్‌ బొటిక్‌ మ్యాన్షన్లు మాత్రమే ఇక్కడ ఉంటాయని, 475, 950, 760 చదరపు గజాల్లో వీటి నిర్మాణం జరుగుతోందని తెలిపారు. 50 వేల చదరపు గజాల విలాసవంతమైన క్లబ్‌ హౌస్‌ను ఇక్కడ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని