Tamilisai: సమరయోధుల చరిత్ర దేశభక్తిని రగిలిస్తుంది

స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర దేశభక్తిని రగిలిస్తుందని గవర్నర్‌ డా.తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. యువత చదువుతో పాటు యోధుల గాథలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సోమవారం సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ‘ఆజాదీ కా

Updated : 09 Aug 2022 04:54 IST

 ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరేయాలి: గవర్నర్‌ తమిళిసై

చార్మినార్‌, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర దేశభక్తిని రగిలిస్తుందని గవర్నర్‌ డా.తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. యువత చదువుతో పాటు యోధుల గాథలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సోమవారం సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’, ‘ఇంటింటా తిరంగా జెండా’ ఉత్సవాల్లో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, సాలార్‌జంగ్‌ మ్యూజియం సంయుక్తంగా ఏర్పాటు చేసిన తెలుగు స్వాతంత్య్ర సమరయోధుల ఛాయాచిత్ర ప్రదర్శనను గవర్నర్‌ ప్రారంభించారు. మ్యూజియం ఈస్ట్రన్‌ బ్లాక్‌హాలులోని సుమారు అరవై మంది సమరయోధుల ఛాయాచిత్రాల కళాఖండాల ప్రదర్శనను గవర్నర్‌ అధికారులతో కలిసి వీక్షించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ(సౌత్‌ జోను) డైరెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌, అదనపు డైరెక్టర్‌ రంజనాదేవ్‌ శర్మ, మ్యూజియం డైరెక్టర్‌ డా.ఎ.నాగేందర్‌రెడ్డి, పీఐబీ, సీబీసీ డైరెక్టర్‌ శృతిపాటిల్‌ తదితరులతో కలిసి గవర్నర్‌ తిరంగా జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 నుంచి 15 వరకు ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగరేయాలని పిలుపునిచ్చారు. మ్యూజియం ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్తూపాన్ని గవర్నర్‌ ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని