Singareni: సింగరేణిలో సమ్మె సైరన్‌!

సింగరేణిలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుల హైపవర్‌ వేతనాలు, ఇతర సమస్యల పరిష్కారానికి సోమవారం హైదరాబాద్‌లోని లేబర్‌ కమిషర్‌ కార్యాలయంలో జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. సింగరేణి

Updated : 09 Aug 2022 04:59 IST

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: సింగరేణిలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుల హైపవర్‌ వేతనాలు, ఇతర సమస్యల పరిష్కారానికి సోమవారం హైదరాబాద్‌లోని లేబర్‌ కమిషర్‌ కార్యాలయంలో జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. సింగరేణి యాజమాన్య ప్రతినిధులెవరూ హాజరుకాలేదు. గైర్హాజరును నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కమిషనర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వచ్చే నెల 9 నుంచి సింగరేణిలో నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ డి.శ్రీనివాసులు, జీఎం (పర్సనల్‌) ఆనందరావుకు నోటీసు ఇచ్చారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు గుత్తుల సత్యనారాయణ, బి.మధు, ఇనపనూరి నాగేశ్వరరావు, ఎ.వెంకన్న, నాగభూషణం, యాకూబ్‌షావలి, రాసుద్దీన్‌, ఎర్రగాని కృష్ణయ్య, రమేష్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు