TSRTC: ఆగస్టు 15న పుడితే.. 12 ఏళ్లు వచ్చేదాకా ఉచిత ప్రయాణం
‘అజాదీ కా అమృతోత్సవ్’ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 12 రోజుల పాటు వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులందరికీ వారికి 12 సంవత్సరాలు పూర్తి అయ్యేంత
సిటీ బస్సుల్లో అవకాశం
75 ఏళ్లు దాటిన వారికి తార్నాక ఆసుపత్రిలో ఉచిత వైద్య పరీక్షలు.. టీఎస్‌ఆర్టీసీ
ఈనాడు, హైదరాబాద్: ‘అజాదీ కా అమృతోత్సవ్’ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 12 రోజుల పాటు వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులందరికీ వారికి 12 సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులు ఈ నెల 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. టీ-24 బస్ టికెటును ఆ రోజున రూ.75(సాధారణ రోజుల్లో రూ.120)కే విక్రయిస్తామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల పదో తేదీ నుంచి 21వ తేదీ వరకు 12 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. ‘‘మంగళవారం నుంచి ఆర్టీసీకి చెందిన అన్ని ప్రాంతాల్లో ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు జాతీయగీతాన్ని ఆలపిస్తాం. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు అన్ని బస్సులకు జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేస్తాం. ఉద్యోగులంతా అమృతోత్సవ్ బ్యాడ్జీలతోనే విధులకు హాజరు కావాలి’’ అని కోరారు.
మరికొన్ని కానుకలు ఇలా..
* తితిదే ప్యాకేజీని వినియోగించుకునే ప్రయాణికులకు ఈ నెల 16 నుంచి 21 వరకు రూ.75 తగ్గింపు.
* ఆగస్టు 15న కార్గోలో ఒక కిలో పార్సిల్ 75 కిలోమీటర్ల వరకు ఉచిత రవాణా.
* టాప్-75 ప్రయాణికులకు ఒక ట్రిప్ టికెటు ఉచితం.
* శంషాబాద్ విమానాశ్రయానికి ఆగస్టు 15న పుష్పక్ ఎయిర్ పోర్ట్ సర్వీసును వినియోగించుకునే ప్రయాణికులు 75 శాతం ఛార్జీ చెల్లిస్తే చాలు.
* 75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఆగస్టు 15 నుంచి 22వ తేదీ వరకు ఉచిత వైద్య పరీక్షలు. 75 ఏళ్లలోపు వారికి రూ.750లతో వైద్య పరీక్ష ప్యాకేజీ.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K Viswanath: బాల సుబ్రహ్మణ్యంకు కోపం వచ్చిన వేళ.. అలా నటుడిగా మారిన కె.విశ్వనాథ్
-
India News
Parliament: రెండోరోజూ అదానీ ఎఫెక్ట్.. వాయిదా పడిన ఉభయ సభలు
-
General News
Andhra News: వివేకా హత్య కేసు.. సీబీఐ ముందుకు జగన్ ఓఎస్డీ
-
Politics News
Kakani Govardhan Reddy: అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్: కోటంరెడ్డికి మంత్రి కాకాణి కౌంటర్
-
Movies News
Writer Padmabhushan Review: రివ్యూ: రైటర్ పద్మభూషణ్
-
Sports News
Virat Kohli: స్పిన్ ఎదుర్కోవడం కోహ్లీకి కాస్త కష్టమే.. కింగ్‌కు మాజీ ఆటగాడి సూచన ఇదే..!