KTR: నీతిఆయోగ్‌... నేతి బీరే: ట్విటర్‌లో కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వం పక్షపాతం, వివక్షతో గతంలో నీతి ఆయోగ్‌ సిఫార్సులను బుట్టదాఖలు చేసిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు మండిపడ్డారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్‌లో నీతి కూడా

Updated : 09 Aug 2022 06:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం పక్షపాతం, వివక్షతో గతంలో నీతి ఆయోగ్‌ సిఫార్సులను బుట్టదాఖలు చేసిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు మండిపడ్డారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్‌లో నీతి కూడా అంతే ఉందన్నారు. అందుకే సీఎం కేసీఆర్‌ నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించారని స్పష్టం చేశారు.. ప్రధాని, ముఖ్యమంత్రులు హాజరయ్యే నీతి ఆయోగ్‌ సమావేశానికి సీఎం హాజరై ప్రశ్నించి ఉండాల్సిందని మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్‌ చేసిన సూచనకు జవాబుగా కేటీఆర్‌ ఈ ట్వీట్‌ చేశారు.

* భాజపా మతోన్మాదాన్ని, అది చేసే తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తామని, దీనికి భయపడి, కుంగిపోయే వారెవరైనా ఉంటే వెంటనే తన ఖాతా నుంచి వైదొలగాలని కేటీఆర్‌ సూచించారు.

ఇన్ఫోసిస్‌, ఇంటెల్‌లకు అభినందనలు

ప్రసిద్ధ పారిశ్రామిక సంస్థ ఇంటెల్‌ తెలంగాణకు చెందిన వాలుకా సొల్యూషన్స్‌ను గ్రాఫిక్స్‌, ఆటో డిజైన్‌ విభాగాల్లోకి తీసుకోవడంపై మంత్రి కేటీఆర్‌ అభినందించారు. దీని ద్వారా ఇంటెల్‌ తెలంగాణలో విస్తరించిందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 200 మంది కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు ఆవిష్కరణల కార్యక్రమంపై పోచారం క్యాంపస్‌లో శిక్షణ ఇస్తున్న ఇన్ఫోసిస్‌ సంస్థకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని