Electricity Amendment Bill:సవరణ బిల్లు ఆమోదిస్తే బతుకు భారమే

విద్యుత్తు సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే తన ఉద్యోగంపై ప్రభావం చూపుతుందన్న భయంతో విద్యుత్తు ఆపరేటర్‌ ఒకరు ఆత్మహత్యకు యత్నించారు.  నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపులో మంగళవారం

Updated : 10 Aug 2022 04:42 IST

ప్రధాని పేరుతో లేఖ రాసి విద్యుత్‌ ఆపరేటర్‌ ఆత్మహత్యాయత్నం

ఎడపల్లి, న్యూస్‌టుడే: విద్యుత్తు సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే తన ఉద్యోగంపై ప్రభావం చూపుతుందన్న భయంతో విద్యుత్తు ఆపరేటర్‌ ఒకరు ఆత్మహత్యకు యత్నించారు.  నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపులో మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది. రెంజల్‌ మండలం బోర్గాంకు చెందిన జగన్‌ ఏఆర్పీ క్యాంపు విద్యుత్తు ఉప కేంద్రంలో ఆపరేటరు(ఆర్టిజన్‌)గా పనిచేస్తున్నారు. ఎప్పట్లాగే విధులకు వచ్చిన ఆయన ఆత్మహత్యాయత్నానికి ముందు ప్రధానిని ఉద్దేశించి లేఖ రాశారు. 2004 నుంచి ఉద్యోగం చేస్తున్నానని, బిల్లు ఆమోదం పొందితే.. బ్యాంకు రుణాలు చెల్లించలేమని, ఉద్యోగ భద్రత కరవవుతుందని తెలిపారు. తన మరణంతోనైనా బిల్లు ఆగిపోయి కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆర్టిజన్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. ఆపై బ్లేడుతో మెడ, చెయ్యి, కాళ్ల భాగంలో కోసుకున్నారు. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. తోటి సిబ్బంది, గ్రామస్థులు వెంటనే ఎడపల్లి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం బోధన్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. సత్వర చికిత్సతో ప్రాణాపాయం తప్పింది. ఎడపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ‘శ్రీకాంతాచారి ఆత్మహత్యతో ఉద్యమం ఉద్ధృతమై తెలంగాణ వచ్చింది. నా ఆత్మహత్యతో ఉద్యమం తీవ్రమై కేంద్రం బిల్లు వెనక్కి తీసుకుంటుందనిఆత్మహత్యకు యత్నించా’నని జగన్‌ విలేకరులకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని