HarishRao: అరకోటి కొవిషీల్డ్‌ డోసులు ఇవ్వండి

తెలంగాణలో రెండు రోజులకు సరిపడా డోసులే ఉన్నందున వెంటనే 50లక్షల కొవిషీల్డ్‌ డోసులు పంపాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు మంగళవారం రాసిన లేఖలో కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో

Updated : 10 Aug 2022 05:02 IST

కేంద్రానికి మంత్రి హరీశ్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో రెండు రోజులకు సరిపడా డోసులే ఉన్నందున వెంటనే 50లక్షల కొవిషీల్డ్‌ డోసులు పంపాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు మంగళవారం రాసిన లేఖలో కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.7లక్షల డోసులే అందుబాటులో ఉన్నాయని హరీశ్‌ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌లో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందన్నారు. 106 శాతం తొలిడోస్‌, 104 శాతం రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ సాధించామన్నారు. 18ఏళ్లు పైబడినవారికి కరోనా టీకాల పంపిణీలో తెలంగాణ తొలిస్థానంలో ఉందన్నారు. ముందస్తు డోస్‌ విషయంలో రాష్ట్రం ప్రస్తుతం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తోందన్నారు. ప్రస్తుత డిమాండ్‌ మేరకు రోజుకు 3లక్షల డోస్‌లు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నా.. వాక్సిన్‌ కొరత కారణంగా లక్షన్నరే ఇవ్వగలుగుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని